- వారిద్దరిని వెంటనే అరెస్టు చేయాలి
- తిరుపతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ అసోసియేషన్ నేతల డిమాండ్
- స్థానిక పూలే విగ్రహానికి ఘన నివాళులు… విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీలను చించి దళిత డాక్టర్ను విద్యార్థుల ఎదుట అవమానపరిచి కొట్టి గాయపరిచిన , కాకినాడ రూరల్ ఎమ్మెల్యేలు రఘురామకృష్ణ రాజు నానాజీలను వెంటనే అరెస్టు చేయాలని తిరుపతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ అసోసియేషన్ ప్రజా సంఘాల నేతలు డాక్టర్ పరమ శివన్, నాగేశ్వరరావు, డాక్టర్ ఎం ప్రసాద్ రావు, పున్నాగ సురేష్, రెడ్డప్ప డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారిద్దరి దిష్టిబొమ్మలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ ఎదుట దగ్ధం చేశారు. అంతకుముందు భవన్ నుండి పూలే విగ్రహం వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లి పూల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అటుపిమ్మట విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పూలే విగ్రహం ఎదుటే వారిద్దరి దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకు అసోసియేషన్ నేతలు సభ్యులు ప్రయత్నించిన దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకుకు 3600 కోట్లు కొట్టివేసి ఐపీ పెట్టిన రఘురామకృష్ణరాజు , నానాజీ లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని చించి, దళిత డాక్టర్ ని అవమానపరిచి విద్యార్థినీ విద్యార్థులు ఎదుట దాడి చేసి గాయపరచడం దారుణం అన్నారు. వెంటనే వారిద్దరిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇలాంటి దొంగలను అసెంబ్లీలోకి పంపడం బాధాకరమన్నారు. వందరోజుల కూటమి ప్రభుత్వం పాలన ఏపీలో విఫలమైందన్నారు. దళిత బిడ్డలను నీచంగా మాట్లాడిన వీరిద్దరికీ 2029లో రాష్ట్ర ప్రజలు ప్రధానంగా దళిత బిడ్డలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేతలు స్టార్ కృష్ణ డి రఘురాం రాధాకృష్ణ రాజేష్ ధన శేఖర్ రామ్మూర్తి గురవయ్య బిట్టు భోగం రమేష్, వాసు గోపి గిరి పవన్, దళిత ప్రజా సంఘాల నేతలు దళితులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.