contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పార్టీలకు అతీతంగా మండల అభివృద్ధికి పనిచేద్దాం : ఎమ్మెల్యే పులివర్తి నాని

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో పార్టీలకు అతీతంగా పాకాల మండలాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం కలిసి పని చేద్దామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పిలుపునిచ్చారు. పాకాల మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ లోకనాధం అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే నానికి అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా కార్యదర్శులను, అధికారులను పరిచయం చేసుకున్నారు. పారిశుద్ధ్యనికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. మండలంలో త్రాగునీటికి, వైద్యానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమగు నిధుల కోసం నివేదికలు తయారుచేసి తనకు అంది ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ పాలనలో దురాక్రమణకు గురి అయిన ప్రభుత్వ భూముల వివరాలను తనకు అందించాలన్నారు. గతంలో ఎన్నో అవినీతి అక్రమణలు చోటుచేసుకున్నాయని వాటికి కొంతమంది అధికారులు కూడా ప్రోత్సహించారని ఆ విషయాలను కూడా పరిశీలించనున్నట్లు చెప్పారు. పాకాల మండలం లో డెంగ్యూ వంటి విష జ్వరాలు ప్రబలకుండా చూడాలని అధికారులను కోరారు. ప్రభుత్వం అందిస్తున్న రైతులను అందరికీ వివరించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. గుంతల రహిత రహదారి ఏర్పాటుకు పాకాల మండలం నుంచి శ్రీకారం చుట్టామన్నారు. దీని ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చునని తెలియజేశారు. మండలంలో విద్యుత్ శాఖ అధికారులు 79 ట్రాన్స్ ఫార్మలకు గాను 1 మాత్రమే పెట్టడం జరిగిందని, మిగిలిన వాటిని కూడా త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. ఇ-పాలగుట్టపల్లి గ్రామంలో విద్యుత్ సమస్య వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్యను సత్వరమే పరిష్కరించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఇంకా ఎవరైనా వైసిపి భ్రమలో ఉంటే మారాలని లేకుంటే వేరే దగ్గరికి బదిలీ అయి వెళ్ళవచ్చు అన్నారు. పలువురు అధికారులు సర్వసభ్య సమావేశానికి గైర్హాజరు అవటం ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. దీంతో మండల సర్వసభ సమావేశానికి గైర్హాజరు అయిన వారికి మేమో జారీ చేయాలని, జాబితాను కలెక్టర్ కు పంపాలని ఎంపిడిఓ కు అదేశాలు జారీ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పాలన ప్రారంభించినాక 939 ఇంటి పట్టాలు మంజూరు చేసిందని,ఇంకనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలి అని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో బినామీ పేర్లతో ఇంటి పట్టాలను పొందిన అనర్హులను గుర్తించాలని అధికారులకు తెలిపారు. తన సొంత మండలమైన పాకాల అభివృద్ధికి తన సొంత నిధులు ఖర్చు పెట్టనున్నట్లు ఎమ్మెల్యే నాని ప్రకటించారు  దీపం 2 పధకం ద్వారా పాకాల మండలానికి 16,000 మంది లబ్ధిదారులకు ఉచితంగా సిలిండర్లు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదే నని నాని చెప్పారు. పింఛన‌్ల విషయంలో ఎవ్వరూ అపోహలు నమ్మవద్దు అని తెలియజేసారు. మండలంలో మహిళలకు కుట్టు మిషను ద్వారా ఉపాధి కల్పిస్తామన‌్నారు. పాకాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :