ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా అందరికీ క్యాన్సర్ పరీక్షలు ర్యాలీని గురువారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. స్విమ్స్ మెయిన్ గేటు ఎదురుగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ ప్రారంభమైంది. వర్షం కారణంగా ర్యాలీ పూర్తి స్థాయిలో జరగలేకపోయింది. క్యాన్సర్ పై మహిళల్లో మరింత అవగాహన అవసరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. మొహమాటం వదిలి ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం వల్ల నయం చేసేందుకు అవసమైన మందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. కాగా ఆరోగ్య అలవాట్లు మార్చుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. క్యాన్సర్ పరీక్షలు చేసేందుకు వచ్చే వైద్య సిబ్బందికి ముఖ్యంగా మహిళలు సహకరించి క్యాన్సర్ మహమ్మారిని అరికట్టడంలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. బ్రెస్ట్ , సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ లను ముందస్తు గుర్తిస్తే నయం చేసేందుకు వీలవుతుందని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. అందురూ క్యాన్సర్ పరీక్షలు చేసుకునేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ నెల 14 వ తేదీ నుంచి జరిగే అందరికీ క్యాన్సర్ పరీక్షలు కార్యక్రమాన్ని మహిళలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. 18ఏళ్లు పైబడి 45 ఏళ్లు మధ్య వయస్సు ఉన్న మహిళలు తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని ఆయన కోరారు. ఇళ్ల వద్ద జరిగే ఈ పరీక్షల్లో అనుమానితులకు రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో తదుపరి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్.యు.హెచ్.ఎం స్టేట్ నోడల్ ఆఫీసర్ డా. జె.విజయలక్ష్మి డీఎంఎచ్ ఓ డా. శ్రీహరి, మాజీ ఎం.ఎల్.ఏ సుగుణమ్మ, రుయా, సిమ్స్ ఆస్పత్రుల సూపరిండెంట్లు డా. రవి ప్రభు, డా. రామ్, ఆర్ ఎం ఓ డా. కోటిరెడ్డి, మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డా. చంద్రశేఖర్, స్విమ్స్ క్యానర్ విభాగ నోడల్ ఆఫీసర్ డా.నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్, ఒమేగా, టాటా క్యాన్సర్ హాస్పిటల్ వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.