తిరుపతి: మంగళవారం 75వ భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని తిరుపతిలోని అంబేడ్కర్ భవన్ కమిటీ మరియు అనేక ఇతర లీడర్లు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణంలోని ఆర్.టి.సి. బస్టాండు వద్ద గల డా|| బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి గజమాలలు వేసి, నివాళులు అర్పించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిధిగా సి.టి.ఓ. హరీష్రవు విచ్చేసి, రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంబేడ్కర్ భవన్ ఛైర్మెన్ డా॥పి.పరమశివన్ మాట్లాడుతూ మన భారత దేశం 200 సం॥ బ్రిటీష్ పాలనలో ఉన్నదని, ఎందరో ప్రాణ త్యాగ ఫలితాలతో 1947 ఆగష్టు 15న స్వాతంత్రం వచ్చిందని, ఈ అఖండ భారత దేశానికి పటిష్టమైన రాజ్యాంగ రచన మరియు డ్రాఫ్టింగ్ కమిటీకి ఛైర్మెన్గా అంబేడ్కర్ గారిని ఎన్నుకోవడం జరిగిందన్నారు. విభిన్న జాతులు, మతాలు, సంస్కృతులున్న భారతదేశానికి రాజ్యాంగ రచన భారమంతా తనపై వేసుకొని ఈ అఖండ భారత దేశానికి పటిష్ఠమైన రాజ్యాంగం రాసి ఈ దినం అందించడం జరిగిందన్నారు. ఇందులో కేవలం మనుషులకే కాకుండా దేశంలో ఉన్న ప్రతి ప్రాణికి స్వేచ్ఛగా బ్రతికే హక్కులను పొందుపరిచారని తెలిపారు.
అదేవిధంగా అంబేడ్కర్ భవన్ సెక్రటరీ కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ డా||అంబేడ్కర్ ఎంతో విలువైన ఓటు హక్కును ప్రతి ఒక్క ఫౌరునికి ఇచ్చారని, ఓటును ఒక ఆయుధంగా వాడుకొని మంచి రాజకీయ నాయకులను ఎన్నుకొని మంచి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటుచేసుకోవాలని, దాని ద్వారా రాజ్యాంగ ఫలాలను అందరికి అందేవిధంగా చేసుకోవచ్చని, దాని ద్వారా త్వరితగతిన దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటుందని, ప్రతి ఒక్క యువత రాజ్యాంగంను చదవాలని, చదివించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పూజారి అన్నాస్వామి పుష్పరాజ్, డి.ఆర్.ఎం (రిటైర్డ్), మోగిలప్ప, అంబేడ్కర్ భవన్ కమిటీ సభ్యులు కె.మురళి, కృష్ణయ్య, రామచంద్రయ్య, పి.ఇంద్రముని, సంగీతం సుబ్రమణ్యం, కె. రాధాకృష్ణ, సి. రెడ్డెప్ప, పున్నాక సురేష్, రామ్మూర్తి, యస్.వి. యూనివర్శిటీ రఘురాములు, అడ్వకేట్ అశోక్ సామ్రాట్, చరణ్, జిట్టా గురవయ్య, యస్.సి./యస్.టి వెల్ఫేర్ అసోసియేషన్, టిటిడి, ప్రెసిడెంట్ డా॥యం.ప్రసాద్రావు, టిటిడి డైరెక్టర్ టి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.