- నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,
- పెళ్లకూరు, దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ తనిఖీ.
- గ్యాంబ్లింగ్, గాంజా, వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపి నిలువరించాలి.
- హైవే రహదారి గుండా ఎలాంటి అక్రమ రవాణాకు తావు లేకుండా నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, అడ్డుకట్ట వేయాలి.
- ఎస్.హెచ్.ఓ లు తరచుగా గ్రామ స్థాయిలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రూపు తగాదాలు లేకుండా అరికట్టాలి.
- సైబర్ నేరాలు, ఫేక్ లోన్ యాప్ ల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలి.
- చిన్నపిల్లలు,మహిళలు, వృద్ధుల ఫిర్యాదుదారులకు పోలీస్ స్టేషన్ అండగా నిలవాలి.
- జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్.,
ఈ రోజు తిరుపతి జిల్లా ఎస్పి శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., నాయుడుపేట సబ్ డివిజన్, పెళ్లకూరు, దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి ఎస్.హెచ్.ఓ. మరియు పోలీస్ స్టేషన్ల సిబ్బంది యొక్క పనితీరును సమీక్షించి జనరల్ డైరీ, కేసు డైరీ, కోర్టు క్యాలెండర్ వంటి పలు రికార్డులను తనిఖీ చేసి పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ల నందు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో దర్యాప్తు పూర్తి చేయుటకు అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి త్వరిత గతిన పూర్తి చేయాలనీ, మహిళా సంభందిత నేరాల పట్ల వెంటనే స్పందించి బాధితులకి సరైన న్యాయం చేయాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచి శాంతిభద్రతలను కాపాడవలసిన బాధ్యత మనదేనన్నారు.
హైవే రహదారుల యందు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రత్యేక కార్యచరణ చేపట్టి, ప్రమాదకరమైన మలుపులు, రోడ్ క్రాసింగ్ లను గుర్తించి అక్కడ సూచిక బోర్డులను, బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రమాదాలు జరగకుండా అరికట్టలన్నారు,నిరంతరం వాహనాల తనిఖీలను నిర్వహించి, ఎర్ర చందనం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాన్ని అరికడుతూ, నేరాలు జరగకుండా నివారించాలన్నారు.
నాయుడు పేట సబ్ డివిజన్ పరిధిలో గల కేడీలు, బీసీలు, డిసీలు, పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై ప్రత్యేకమైన నిఘా ఉంచుతూ, పోలీస్ స్టేషన్ల పరిధిలో నేర నివారణ చేయుటకు,బహిరంగ ప్రదేశాల యందు మద్యపానం సేవించకుండా అరికట్టడానికి హైవే రహదారుల వరకు నిరంతరం గస్తీ తిరిగాల్సిన అవసరం ఉందనీ, బీట్ సిస్టం ను బలోపేతం చేసి, మరింత సమర్థవంతంగా పనిచేసి నేర నివారణ చేయాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులను స్వీకరించి చిన్న సమస్యగా ఉన్నప్పుడే ఇరుపక్షాలను పిలిపించి, వారితో సామరస్యంగా మాట్లాడి,సమస్యలు పరిష్కరించాలని ఎటువంటి ఘటనలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., సూచించారు.
ఈ కార్యక్రమంలో పేళ్లకూరు, దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ల యస్.ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు.