- పశువుల పండుగ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకిలో గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు చేసి పశువుల పండుగను మంగళవారం గాదంకి గ్రామస్తుల ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు.
పోటీల్లో పశువులను నిలవరించేందుకు,ఎద్దులకు కట్టిన పలకలను ఛేదించుకోవడానికి యువతను ఉత్సాహంగా పాల్గొన్నారు.పల్లెటూరులో పచ్చని తోరణాలతో పశువుల పండుగకు ముస్తాబు చేసిన గ్రామస్థులు.జల్లికట్టు ను చూసేందకు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన వీక్షకులు.
రంకెలు వేసే పోట్ల గిత్తలు…వాటిని నిలువరించేందుకు పోటీపడుతున్న యువత.పశువుల పండగ అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని గ్రామస్తులకు ఎమ్మెల్యే పులివర్తి నాని సూచించారు.అభిమానుల కోరిక మేరకు ఎద్దులతో ఎమ్మెల్యే ఫోటోలు దిగారు.ఎద్దులకు కట్టిన పలకలను ఛేదించుకోవడానికి యువతను ఉత్సాహంగా పోటీపడ్డారు.