తిరుపతి జిల్లా, తిరుపతి రూరల్ మండలం నందు ఉన్న పంచాయతీ కార్యదర్శుల సమావేశం మంగళవారం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
ఈ ఎన్నికల్లో, తుమ్మలగుంట పంచాయతీ కార్యదర్శి పెయ్యల వెంకటేశ్వర్లు కార్యదర్శుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోబడారు. జాతీయ సెక్రటరీగా దుర్గసముద్రం పంచాయతీ కార్యదర్శి యస్. నరసింహులు, ఉపాధ్యక్షులుగా స్వర్ణమోజుల, కె. నాగరాజులు, మరియు ఏ.పీ. లోకేష్ బాబు ను ఎంపిక చేశారు.
ఇంకా, జాయింట్ సెక్రటరీగా ఎ.ఝాన్సీ, తేజ ట్రెజరర్ గా ఎ. గోపి, మరియు సభ్యులుగా సుజాత, స్వాతి శ్రీ, లావణ్య, జ్యోతిప్రసాద్ లను ఎన్నుకున్నారు.
ఈ కమిటీకి పలువురు పంచాయతీ కార్యదర్శులు అభినందనలు తెలుపుతూ వారి ఉత్తమ పనితీరును ఆశించారు.