తిరుపతి ఆర్డిఓ ఆఫీస్ నందు సోమవారం ఉదయం విశ్వహిందూ పరిషత్ తిరుపతి జిల్లా వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ మరియు హిందూ సంఘాలు మద్దతు పలకడంతో భారీగా హిందూ బంధువులు అక్కడికి చేరుకొని జైశ్రీరామ్ జైశ్రీరామ్ అనే నినాదాలు చేశారు. ఇటీవలే రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి ఊరేగింపు జరుగుతున్న సమయంలో అన్య మతస్తులు ఊరేగింపుకు నిరసనగా నినాదాలు చేస్తూ హిందువులపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పిలుపు మేరకు చంద్రగిరి మండలం నుండి బిజెపి ముఖ్య నాయకులు హాజరవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సామంచి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ హిందూదేశంలో హిందూ దేవతలను పూజించేందుకు, ఊరేగింపులు చేయుటకు హిందువులకు స్వేచ్ఛ లేకపోవడం చాలా బాధాకరమని, పైగా అడ్డుకున్న హిందువులపై అక్రమ కేసులు పెట్టడంపై తీవ్రంగా వ్యతిరేకించారు. రాయచోటి హిందూ బంధువులకు జరిగిన అవమానాన్ని ఖండిస్తూ ఇలాంటి ఘటనలు పునరావతం అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని పోలీసులను హెచ్చరించడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్రమ కేసులు బనాయించిన పోలీసు అధికారులను వెంటనే విధులను తొలగించి హిందువుల మనోభావాలను కాపాడాలని వారు తెలిపారు. లేనియెడల చలో రాయచోటి అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ రాయచోటికి చేరుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం తిరుపతి ఆర్డిఓ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో చంద్రగిరి భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు సుబ్రహ్మణ్యం యాదవ్, ముని గంగిరెడ్డి, వెంకట ముని, ప్రసాద్, నరేష్ కుమార్ నాయుడు,సునీల్ కుమార్ యాదవ్, పురుషోత్తం రెడ్డి, హిందూ శేఖర్, డి.వి.రమణ,విశ్వహిందూ పరిషత్ సభ్యులు దీనదయాల్ నాయుడు,బజరంగీ దళ్ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
