తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఒకవైపు ఎండలు పెరిగి ప్రజలు అల్లాడిపోతూ ఉంటే మరోవైపు చిన్నపాటి గుట్టలు మరియు అడవులను కొంత మంది కావాలనే సొంత లాభం కొరకు తగలబెట్టడం దురదృష్టకర పరిణామమని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్య వర్గ సభ్యులు కొత్తపల్లి వెంకటాద్రి నాయుడు పేర్కొన్నారు. మండలంలోని అడవులను గుట్టలను ఆనుకుని ఉన్న మామిడి పల్ల తోటల కంచెలు ఈ అగ్ని కీలలకు ఆహుతై మామిడి తోటలు కూడా కారు చిచ్చుకు కాలిపోతూ రైతులపై ప్రతి సంవత్సరం తీవ్ర ప్రభావం పడుతుంది. అడవులు ప్రజలకు ప్రధాన ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థలు కాగా వాతావరణ మార్పులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇటువంటి అడవులు తగలబెట్టడం వల్ల కలిగే ప్రభావాలు వాతావరణ మార్పుల గాలిలో కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలై ఇది వాతావరణ మార్పులకు కారణమవుతోంది. మరోవైపు జీవ వైవిధ్యం,అనేక జాతుల జీవులు నివాసాలను కోల్పోతాయి, భూతాపాన్ని పెంచి ప్రజల వేసవి తాపానికి లోనై వడదెబ్బ తగిలి అమాయకపు ప్రజల ఆరోగ్య హానికి దారితీస్తుంది. అడవులు తగలబెట్టడం వల్ల నేల క్షీణత ఏర్పడుతుంది, ఇది వ్యవసాయం మరియు పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగిస్తుంది. ఇప్పటికైనా పాకాల మండలం లోని అటవీ శాఖ సిబ్బంది స్థానిక సచివాలయాల మహిళా పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకొని గ్రామాలలో అడవుల దహనంపై ప్రజలలో అవగాహన కల్పించి మున్ముందు ఇలాంటి చర్యలకు ఆకాతయులు ఎవరూ పాల్పడకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా అటవీ శాఖ ఉన్నతా ధికారులను కోరుతున్నారు.
