తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల నుంచి దామలచెరువు వెళ్లే మార్గంలోని రైల్వే వంతెన కింద పాకాల వంకలో ప్రతి నిత్యం నీటిలో చికెన్, చేపల వ్యర్ధాలు పడవేస్తూ పర్యావరణానికి పెను విఘాతం కలిగే విధంగా కొంతమంది ప్రవర్తించడం తీవ్ర అనారోగ్యకర చర్య అని ప్రజలు మరియు వాహనదారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వ్యర్ధాల నుంచి వచ్చే దుర్వాసన వలన అటుగా వెళ్లే వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు. ఇది ఇలా ఉంటే పాకాల టౌన్ లో కూడా ఎక్కడి అక్కడ ప్రజలు తిరిగే పరిసర ప్రాంతాలలో కుళ్ళిన మాంసం అవశేషాలు పడవేస్తూ పట్టణంలోని ప్రజలను రోగాలకు గురి చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇప్పటికైనా పాకాల పంచాయతీ అధికారులు గమనించి వ్యర్ధాలు పడేస్తున్న దుకాణాల యజమానులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు పెద్ద ఎత్తున కోరుతున్నారు.
