తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని అన్నదాతలకు రోజుకు 7 గంటల పాటు పగలు ఇస్తున్న కరెంటు లో అనేక సార్లు అనదికారిక కోతలు విధిస్తున్నారు. దీనికి తోడు లో వోల్టేజ్ సమస్య ఒక వైపు దీనికి తోడు భావిరాగన్న చెరువులో ఊరిలోని రైతులకు ఇచ్చే విద్యుత్ వైర్లను పోయిన శుక్రవారం కనేక్షన్ మార్చి ఇవ్వడం చేత వ్యవసాయ మోటార్లు రివర్స్లో తిరుగుతున్నాయి అని కరెక్ట్ గా కనెక్షన్ ఇవ్వమని రైతులు విద్యుత్ అధికారులను అడగగా మేము ఇవ్వడం సాధ్యం కాదు అని మీరే మార్చి ఇచ్చుకోమని సలహాలిస్తున్నారు. కనెక్షన్ మార్చి ఇవ్వడం చేత మోటార్లు రివర్స్లో తిరిగి ఇద్దరు రైతుల వ్యవసాయ మోటార్లు కాలిపోయాయి. ఇందులో ఒక కోళ్ల ఫారం రైతు కూడా ఉన్నారు కోళ్ల పారానికి సరైన సమయంలో నీరు అందక దాదాపు వెయ్యి కోడి పిల్లల వరకు చనిపోయాయని రైతు జయచంద్ర రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి పై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విధి నిర్వహణలో అలసత్వంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని కోతలు లేని కరెంటు ఇవ్వాలి అని దోమ వేణుగోపాల్ నాయుడు కోరుతున్నారు.
