తిరుపతి జిల్లా, పాకాల మండలంలోని ప్రజలకు శాంతి భద్రతలను కాపాడేందుకు అన్నివిధాల రక్షణగా ఉండేందుకు మేమున్నామని భరోసా కల్పించేందుకే ప్రత్యేక (ఎస్ టి ఎఫ్) స్పెషల్ పార్టీ బలగాలతో కవాతును నిర్వహించినట్లు పాకాల సిఐ సుదర్శన్ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం పాకాల మండలంలోని అన్ని పంచాయతీలో ప్రత్యేక (ఎస్ టి ఎఫ్) స్పెషల్ పార్టీ బలగాలతో కవాత్తును నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సుదర్శన్ ప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు చంద్రగిరి డి.ఎస్.పి బి.ప్రసాద్ ఉత్తర్వుల మేరకు పాకాల మండలంలోని అన్ని పంచాయతీలలో స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక (ఎస్ టి ఎఫ్) స్పెషల్ పార్టీ బలగాలతో కవాతు నిర్వహించామన్నారు. గ్రామాలలో ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్ వచ్చి చెప్పుకోవాలన్నారు. సమస్యాత్మక గ్రామాలలో నిరంతరం పహారా ఉంటుందన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి ఏ సమస్య ఉన్న వెంటనే పోలీసులకు తెలియజేయాలని సిఐ సుదర్శన్ ప్రసాద్ ప్రజలకు తెలియజేశారు.
