రాబోవు విద్యా సంవత్సరానికి ఇప్పటి నుండే విద్యార్థుల నమోదు ప్రక్రియ చేసుకోవాలని తిరుపతి జిల్లా పాకాల మండల విద్యా శాఖాధికారి బాబ్జి అన్నారు.ఆయన శుక్రవారం స్థానిక మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల పోటీ ఉన్నందున విద్యార్థుల నమోదును ప్రక్రియను చేసుకోవాలని కోరారు. తల్లిదండ్రులకు మన మీద నమ్మకం ఉంటేటట్లు చూసుకోవాలని అన్నారు. అప్పుడే నమోదు పెరుగుతుందని అన్నారు.అదే విధంగా మన దగ్గర చదువుతున్న ప్రస్తుత విద్యార్థులు పై తరగతులకు వెళ్ళేటట్లు చూడాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించాలని చెప్పారు.ప్రస్తుతం సెల్ఫ్ ఆసస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షలు అనంతరం వాటిని రుద్ది ఫలితాలను తల్లిదండ్రులకు తెలియ చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కుమార్ రెడ్డి,చౌదరి,సుమలత, జయచంద్ర,హేమలత,నరసింహ రెద్దు,ఉపాధ్యాయులు, సి.ఆర్.పి.లు పాల్గొన్నారు.
