తిరుపతి జిల్లా పాకాల మండలంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ భవనం ఆధ్వర్యంలో పాకాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్ జయంతి గాని, వర్ధంతిని గాని జరుపుకోవడం అందరి బాధ్యత అన్నారు. అంబేద్కర్ వేడుకలను జరుపుకోవడంలో ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ హితం కోసమే అంబేద్కర్ భవన్ పనిచేస్తుందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పరంగా అందరికీ హక్కులు కల్పించి నారు అన్నారు రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని మహిళలకు హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. బీసీ వర్గానికి దామాషా ప్రకారం రాజకీయంగా, ఉద్యోగపరంగా, రిజర్వేషన్ల పరంగా సమాన అవకాశాలు కల్పించారు. దేశ ప్రజల అభివృద్ధి కోసం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రత్యేకమైన కార్పొరేషన్లు తీసుకొచ్చి అన్ని వర్గాల ఆర్థిక అభివృద్ధికి కృషి చేశారన్నారు. భారతదేశ స్థితిగతులను పూర్తిగా అవగాహన చేసుకుని రాజ్యాంగంలో మానవాళికి సమాన హక్కులు ఆయన కల్పించారు. కొంతమంది అంబేద్కర్ కొందరువాడని పేర్కొంటున్నారని అది వాస్తవం కాదు అన్నారు. ప్రపంచంలోనే ఇంతవరకు అంబేద్కర్ అంతటి జ్ఞానాన్ని పొందిన మరొక వ్యక్తి లేదని చరిత్ర తెలుపుతుందన్నారు. శ్రామికులకు ఎనిమిది గంటలు పనిగంటలుగా, ఉద్యోగస్తులకు సెలవులు పరంగా, గర్భవతులకు ప్రత్యేక సెలవులు తీసుకొచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ దే అన్నారు. దేశ ప్రజలు రాజ్యాంగం చదవాలని విద్యతోనే అభివృద్ధి సాధ్యమని తన ప్రకటనలో పేర్కొన్న ఏకైక వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవనం అధ్యక్షులు గుండ్లపల్లి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గణేష్, ఉపాధ్యక్షులు నాగరాజు, కోశాధికారి శివ ప్రసాద్, దళిత నాయకులు ఎం ప్రభు, ఆనందయ్య, డాక్టర్ సుధాకర్, సురేంద్ర, దిలీప్, రాయలసీమ మోహన్, రామ్మూర్తి, ఆదికేశవులు, రెడ్డప్ప, జయదేవ్, వెంకటేష్, నరసింహులు, అంజి దళిత నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
