- విధి నిర్వహణలో నిర్లక్ష్యం నేపథ్యంలో ఎస్సై పి. రవిబాబు నీ సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు
- పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలి … అతిక్రమిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట పోలిస్ స్టేషన్ ఎస్సై గా రవిబాబు విధులు నిర్వహిస్తూ 2023 సంవత్సరంలో ఒక హత్యాయత్నం కేసు విషయంలో నిర్లక్ష్యపు విచారణ చేసి, కీలకమైన ప్రత్యక్ష సాక్షులను విచారించడంలో వైఫల్యం చెందడం, నిందితులను అనధికారికంగా తొలగించారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై జిల్లా ఎస్పి విచారించగా .. ఎస్సై రవిబాబు 28-08-2021 నుండి 09-10-2023 వరకు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న సమయంలో ఒక హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో గాయపడిన వ్యక్తిని మరియు ప్రత్యక్ష సాక్షిని విచారించడంలో అతను విఫలమయ్యాడు. పై అధికారుల నుండి అనుమతి లేకుండా ఈ కేసుకు సంభందపడిన నిందితులను తొలగించి, ఫిర్యాదుదారునికి ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కేసును తప్పు దోవ పట్టించారు. నేరం జరిగిన ప్రదేశంలో స్వాధీనం చేసుకున్న వస్తువులను న్యాయస్థానం ద్వారా ఆరై.ఎఫ్.యస్.యల్ కి పంపకుండా కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం చేసాడని తెలిసింది. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తీవ్రంగా పరిగణిస్తూ సదరు ఎస్సై ని మంగళవారం సస్పెన్షన్ చేశారు.
పోలీస్ శాఖ లో ఎవరైనా సరే క్రమశిక్షణ మరియు వృత్తి నైపుణ్యం యొక్క అత్యున్నత ప్రమాణాలను పాటించకపోతే సహించేది లేదని, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. పోలీస్ శాఖ అంటే నిర్దిష్టమైన క్రమశిక్షణ కలిగిన సేవ అని ఎప్పుడూ ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలన్నారు. ఎవరైనా పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఉపేక్షించబోమని ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.