- ఇకనైనా చిన్న చిన్న పనులు చేయామని కోరుతున్నా…!!
- సమస్యలు చెప్పుకోవడానికి వైసీపీ వాళ్లే ఆహ్వానిస్తున్నారు…!!
- సమస్యలపై చర్చించుకోవడానికి సమయం కేటాయించండి…!!
- చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి .
తిరుపతి, మే-23 : వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు మండలానికి చేసింది ఏమి లేదని చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆమె మంగళవారం యర్రావారిపాళెం మండలం, కోటకాటపల్లి పంచాయితీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మీడియాతో మాట్లాడారు. మా సమస్యలు చెప్పుకోవాలని మా గ్రామానికి రావాలని వైసీపీ వాళ్లే ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నారు. ఇకనైనా చిన్న చిన్న పనులు చేయారని గత నెల నుంచి ఎమ్మెల్యే గారికి చెపుతూనే ఉన్నాను. ప్రతి రోజు ప్రతి గ్రామం తిరుగుతాను. మా నాయకులు దగ్గర కాకుండా ప్రజల దగ్గర సమస్యలు చెప్పిస్తున్నాను. ప్రతి పల్లె, ప్రతి వీధి, ప్రతి చోట సమస్యలు ఉన్నాయి. ప్రజల సమక్షంలో సమస్యలపై ఇద్దరం చర్చించుకోవాల్సిందే… రోజు నేను చెప్పడం, మీరు కాగితాల లెక్కలు పంపించడం వృథా… 9 సంవత్సరాలు ప్రజల ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నారో… ఇక ప్రజలకు సమాధానం చెప్పాలి. జగనన్న మీకు నాలుగు పదవులు ఇచ్చారు. బిజీగా ఉంటారు కనుక సమయం చూసుకుని చెప్పితే ప్రజలందరూ వస్తారు ఖచ్చితంగా చర్చించుకుంటం అని పులివర్తి సుధారెడ్డి పేర్కొన్నారు.
సమస్యలు ఏమి లేవని ఎమ్మెల్యే మభ్యపెడుతున్నారు…
ఇన్చార్జ్ గా 6 నెలల కాలంలో “పులివర్తి నాని” కోటకాడపల్లి సమస్యలు పరిష్కారించారు…
కార్యకర్తల సమావేశంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు “నిరంజన్”
ప్రతి పంచాయతీ అభివృద్ధికి దాదాపు రూ.4 కోట్లు ఖర్చు చేశామని ఎమ్మెల్యే మభ్యపెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కోటకాడపల్లి పంచాయితీ సమస్యలు ఒక్కటి పరిష్కారం కాలేదు. 2019 ఎన్నికలకు 6నెలల ముందు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పులివర్తి నాని కోటకాడపల్లి అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎస్సీలకు 35 ఇళ్లు పట్టాలు మంజూరు చేయించారు. ప్రచార సమయంలో అయ్యగారిపల్లిలో నీటి సమస్య కోసం సొంత నిధులు రూ.30 వేలు ఇచ్చారు. ఆ పనులను కూడా నిలుపుదల చేశారు. అధికారం లేకున్నా అండగా ఉంటున్న పులివర్తి నానిని గెలిపించుకుంటే చంద్రగిరి నియోజకవర్గ భవిష్యత్తు బాగుపడుతుందన్నారు.