contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాజ్యాంగ రక్షణ – భారతీయుల బాధ్యత

తిరుపతి జిల్లా అంబేద్కర్ భవనం ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ కమిటీ చైర్మన్ పి.పరమశివన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి 75 వసంతాలు నిండిన సందర్భంగా రాజ్యాంగ రక్షణ పట్ల విద్యావంతులు, మేధావులు చర్చించాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఎందుకంటే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదేండ్లలో రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. పాలకులు రాజ్యాంగానికి విరుద్ధమైన పాలనసాగిస్తూ ప్రజల్ని కులం,మతం,ప్రాంతం పేరుతో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందుతున్నారన్నారు. ఇది రాజ్యాంగాన్ని అమలు చేయడం కాదు, పూర్తి విస్మరించడమే అవుతుందన్నారు. దేశ ప్రజలందరూ ఇష్ట పూర్వకంగా ఒప్పుకుని ఆమోదించుకున్న నియమాలు, ప్రతిజ్ఞలు, హక్కులు బాధ్యతల సమాహారమే మన రాజ్యాంగం అన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదిగా కీర్తించబడుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో భవన్ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, మెంబర్లు పుష్ప రాజ్, కృష్ణయ్య, ప్రసాద్ రావు, మురళి, అమరేశ్వరి, బాలాజీ, శరణ్, రామచంద్రయ్య, గోపాలకృష్ణ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :