హైదరాబాద్ : ఈ రోజు తెలంగాణ మూవీస్ & టివి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వై.కిరణ్ కుమార్ , సభ్యులు రాజేష్ లాల్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత ముప్పై సమత్సరాలుగా అన్ని రంగాలలోను ఆంధ్రా కార్మిక సంఘాల నాయకుల చేతిలో తెలంగాణ కళాకారులు అణచివేతకు గురై, పని లేక, ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలంగాణ సినీ మరియు టివి డబ్బింగ్ కళాకారుల సంగం ఏర్పడి నేటికీ సమత్సర కాలం దాటినప్పడికి తెలంగాణ కార్మిక సంఘాలు చెల్లవని, ఎక్కువకాలం నిలవవని తప్పుడు ప్రచారాలు చేయడమే కాక మాకు న్యాయంగా దక్కాల్సిన అవకాశాలు దక్కనివాఁకుండా రాజకీయాలు చేస్తూ అణచివేస్తున్నారని ఆవేదన వక్తం చేసారు. ఇకనైనా మంత్రివర్యులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కిరణ్ కుమార్ కోరారు
