కరీంనగర్ జిల్లా: తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య(టీ ఎన్ ఎస్ ఎఫ్) తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షునిగా పర్లపల్లి రవీందర్ తిరిగి నియామకమయ్యారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పర్లపల్లి రవీందర్ టీఎన్ఎస్ ఎఫ్ లో వివిధ హోదాల్లో విద్యార్థులు, విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు.టీ ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకం తర్వాత సమస్యలపై అనేక పోరాటాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రవీందర్ కృషికి గుర్తుగానే ఆయనను టీ ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తిరిగి నియామకం జరిగింది. టీ ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం కల్పించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు,అందుకు సహకరించిన పార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి,నన్నురి నర్సిరెడ్డి ,కాట్రగడ్డ ప్రసూన, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు వంచ శ్రీనివాస్ రెడ్డి లకు రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు.