మెదక్ జిల్లా శుక్రవారం తూప్రాన్ ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా
కార్యాలయంలో ఫైల్స్ నిర్వహణ, ల్యాండ్ రెవెన్యూ ,ల్యాండ్ మేనేజ్మెంట్, ఆర్ ఆర్ ఆర్ , రెవిన్యూ కలెక్షన్, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాల గురించి, సిబ్బంది పనితీరు సంబంధిత విషయాలను ఆర్డీవోను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ పనితీరు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చే ప్రజలకు వారి సమస్యలను ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు.