అల్లూరి జిల్లా,అనంతగిరి, ది రిపోర్టర్ న్యూస్ : అనంతగిరి టూరిజం రిసార్ట్ లో పనిచేస్తున్న పాంగి లక్ష్మణ్ రావు,పై స్థానిక వైసిపి నాయకులు రాజకీయ వేధింపులు గురి చేస్తున్నారని అందులో ఎటువంటి కారణం లేకుండా లక్ష్మణ్ కు కర్నూలు టూరిజం డివిజన్ కి బదిలీ చేయడం పై టూరిజం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హరిత హిల్ రిసార్ట్ లో శనివారం నాడు నిరసన చేస్తూ డిమాండ్ చేశారు.ఒక ప్రకటనలో పాత్రికేయులకు తెలుపుతూ… గిరిజన టూరిజం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత కొంతకాలంగా లక్ష్మణ్ ఉద్యమిస్తున్నారని చురుగ్గా పోరాటంలో పాల్గొంటున్నరని లక్ష్మణ్ పై స్థానీక వైసిపి నాయకులు, కార్యకర్తలు, కక్షపూరితంగా కర్నూలుకి బదిలీ చేయించారని వారు తెలిపారు. తక్షణమే బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఏపీ టూరిజం వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిత హిల్ రిసార్ట్ లో పనిచేస్తున్న కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
