contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మా ట్రేడ్ మార్క్ హక్కులను ఉల్లంఘిస్తున్న RTV

మా ఛానల్ కి సంబంధించిన ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘిస్తూ మా లోగో మాదిరిగా లోగోని తయారు చేసుకుని , ఈ మధ్యకాలంలో RTV పేరుతో యూట్యూబ్ మరియు లైవ్ టెలికాస్ట్ చేస్తున్న రాయుడు విజన్ మీడియా లిమిటెడ్ వారికి తెలియజేసినది ఏమనగా, మాయొక్క లోగో ట్రేడ్ మార్క్ హక్కులను ఉల్లఘిస్తున్నారని గమనించగలరు. ఈ సంవత్సరం ( తేదీ 04 జనవరి 2023 అప్లికేషన్. సంఖ్య : 5750607/ RTV, తరగతి :38, రాయుడు విజన్ మీడియా లిమిటెడ్.) ధరఖాస్తూ చేసారు.

(The Reporter Tv) రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ యజమానిగా మా లోగో కు సంబంధించి సర్వ హక్కులు కలిగియున్నాము , RTV అనే లోగో యొక్క డైమన్షన్స్ మా లోగో The Reporter TV “R” డైమన్షన్స్ సమానంగా ఉండడం వలన మాయొక్క ఛానల్ ప్రేక్షకులకు, మా సిబ్బందికి గంద్రగోలాన్ని కలిగిస్తుంది, ఏది ఏమైనా అనధికారికంగా ఉపయోగించడం మా యొక్క హక్కులను ఉల్లంఘిస్తున్నట్టుగా భావించవలసి వస్తుంది.

ఈ విధంగా RTV వారు మా లోగోకి సరిసమానంగా లోగోని తయారు చేసి మా మార్కెట్ ని దెబ్బతీయడం క్రిమినల్ నేరమని గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము . మరియు ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు కారణమైన కంపెనీ పై తగిన చట్టపరమైన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాము.

ఇట్లు
ది రిపోర్టర్ టీవీ యాజయాన్యం
హైదరాబాదు
9492986819

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :