హైదరాబాద్: బాలానగర్ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు 65వ జాతీయ రహదారి మీదుగా నాలా పనుల నిమిత్తం.. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట, బేగంపేట వైపు, బాలానగర్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట్ వైపు, మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డు నుంచి అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్లు బాలానగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
►కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలు కూకట్‌పల్లి మెట్రో రైల్ స్టేషన్ వద్ద యూ టర్న్ తీసుకుని ఐడీఎల్ లేక్ రోడ్డు, గ్రీన్‌హిల్స్ రోడ్డు, రెయిన్‌బో విస్టాస్, ఖలాపూర్ ఫ్లైఓవర్, పర్వతనగర్, టాడీ కాంపౌండ్, కావూరిహిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, యూసుఫ్‌గూడ రోడ్, మైత్రివనం, అమీర్‌పేట్ మీదుగా వెళ్లాలి.
►కూకట్‌పల్లి నుంచి బేగంపేట వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కూకట్‌పల్లి వై జంక్షన్‌లో బాలానగర్ ఫ్లైఓవర్, న్యూ బోయిన్‌పల్లి జంక్షన్, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు.
►బాలానగర్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను బాలానగర్ ఫ్లైఓవర్ కింద, న్యూబోయిన్‌పల్లి జంక్షన్, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట్ ఫ్లైఓవర్, అమీర్‌పేట్ నుంచి మళ్లిస్తారు.
►మూసాపేట, గూడ్స్ షెడ్ నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తారు ఐడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్‌బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పర్వత్‌నగర్, టోడీ కాంపౌండ్, కావూరి హిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, యూసుఫ్‌గూడ రోడ్, మైత్రివనం, అమీర్‌పేట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.