contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Metpally: ట్రాఫిక్‌ గాలికి.. వసూళ్లకు పరుగులు..

జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :నగరంలో ట్రాఫిక్‌ జంక్షన్లు దాటేందుకు ఎదురు చూపులు తప్పడం లేదు. ట్రాఫిక్‌తో రోడ్లన్నీ రద్దీగా ఉన్నా, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించేందుకు రోడ్లపై ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం కన్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే, రోజువారీగా చలాన్లు వేయడం, వాటిని వసూలు చేయడమే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసులు పనిచేస్తున్నారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ కంటే, చలాన్లు వసూలు చేసే పనిలోనే ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తున్నారు

ఓల్డ్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ సరిగా లేక దీంతో ఎక్కడి ట్రాఫిక్‌ అక్కడే జామ్‌ అవుతుంది. పగటి పూటనే కాదు, రాత్రి 11 గంటల వరకు నగరంలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలను మాత్రం అధికారులు వెతకడం లేదు.

అధికారుల పర్యవేక్షణ కరువవ్వడంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడుతుంది. జంక్షన్ దాటేందుకు నిమిషాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ట్రాఫిక్‌లో కొందరు అధికారులు కార్యాలయాల నుంచి బయటకు రాకుండానే పనిచేస్తున్నారు. కొందరైతే క్షేత్ర స్థాయిలో ఏమి చేయాలి? ఏమి లోపాలున్నాయి? అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఉండటంతో తమ అధికారి అలానే ఉన్నాడు, మమ్మల్ని ఎవరు అడుగుతారనే భావనతో ట్రాఫిక్‌పై దృష్టి కూడా పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ఇలా, ట్రాఫిక్‌లో చాలా మంది క్షేత్ర స్థాయిలో ఉంటూ ఎప్పకటిప్పుడు సమస్యలను పరిశీలిస్తూ పనిచేయాల్సి ఉండగా, మననెవరు అడుగుతారు? అనే ధీమాతో రోడ్లపైకి కూడా రాకుండా పనిచేస్తుండటంతో నగర వాసులు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :