గిరిజన పథకాలను రద్దు చేసి… సంక్షేమ పథకాలకు వాడేసుకున్నారు.
నిరుద్యోగం పెరిగిపోతుంది.. విద్యార్థులు, యువత పోరాటం చేయాలి.
ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు చేస్తున్న అన్యాయాల పైనా పోరాటం చేయాలని గిరిజన నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లోని కెమిస్ట్&డ్రగిస్ట్ అసోసియేషన్ హాలులోని ఏ.పి గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ గిరిజన దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న గిరిజన బ్రతుకుల్లో మార్పులు రావడం లేదని, ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని నాయకులు మండిపడ్డారు. గిరిజన ప్రజల్లో, యువతలో ప్రశ్నించేతత్వం వస్తేనే పోరాటం చేయడానికి సుముఖత వ్యక్తం చూపగలరని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో గిరిజనులకు సముచిత న్యాయం జరగడం లేదన్నారు. విద్యార్థులు ,యువత పోరాటం చేయాలన్నారు. గిరిజనులు ఉన్న ఆయా గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది అగ్రవర్ణాల చేతుల్లో నడుస్తున్నాయని ఆ విధానానికి స్వస్తి పలకాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పినట్లు పోరాటం ద్వారా ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకోవచ్చని నాయకులు హితవు పలికారు. దేశానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఐక్యరాజ్యసమితి 1993 వ సంవత్సరముల్లో ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలల్లో నివసిస్తున్న గిరిజన ప్రజల స్థితిగతులపై అధ్యయనం చేసి 7 తీర్మానాలను అమలు చేసి ఆయా రాష్ట్రాలకు పంపితే ప్రభుత్వాలు పెడచెవిన పెట్టలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించి నామమాత్రంగానే సీట్లు ఇస్తున్నారని, రాజకీయంగా గిరిజనులను అణగ తొక్కుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా గిరిజన ప్రజలు కళ్ళు తెరిచి పోరాటానికి సిద్ధమై రాజ్యాంగం ప్రకారం మన హక్కులను మనం కాపాడుకోవాలన్నారు. గిరిజన ఓటు బ్యాంకు తో గద్దెనెక్కిన పాలకులు ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లోను,సబ్ ప్లాన్ నిధులు, కళ్యాణ లక్ష్మి పథకం తో పాటు పలు రకాలైన పథకాలను రద్దు చేసి గిరిజన ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని, రానున్న ఎన్నికల్లో గిరిజన ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమ అనంతరం ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి. శ్రీను నాయక్ ను ఎస్టీ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు కేతావతు మంత్రు నాయక్, సంగం గోపాలవారి పాలెం సర్పంచ్ నాగమల్లేశ్వరరావు, ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కుంభ నాగేశ్వరరావు, గిరిజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బి.శివ నాయక్,ఉపాధ్యక్షులు పాలపర్తి లక్ష్మణ్, కోశాధికారి బి. రాంబాబు నాయక్, పట్టణ ఎస్టీ సెల్ నాయకులు బి. బాలకోటి నాయక్, యడ్లపాడు మండల ఎస్టీ నాయకులు వి. శ్రీను నాయక్, ఉన్నవ గ్రామ ఎస్టీనాయకులు తోకల పాపారావు, మురికిపూడి గ్రామ ఎస్టి నాయకులు పి. వీరాంజనేయులు, కనపర్తి గ్రామ ఎస్టీ నాయకులు మొగిలి శ్రీనివాసరావు,బొప్పిడీ గ్రామ ఎస్టీ నాయకులు కుంభ నాగేశ్వరరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాదాసు పృథ్వీ సాయి, కొండ్రముట్ల నాగేశ్వరరావు, తేజ, ఎస్సీ నాయకులు జమ్మలమడక ఆది బాబు,నేలం యేసు రాజు, ఆర్ .మోహన్ నాయక్ రవ్వలకొండ, తో పాటు పలు గ్రామాల ఎస్టి,ఎస్సి, బి.సి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…!!