contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. హెల్ప్‌లైన్ నంబర్లు

  • ఘటనా స్థలానికి చేరుకున్న DRM
  • యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు
  • స్థానిక ప్రభుత్వ అధికారులు, NDRF సహాయం కోరిన రైల్వే
  • సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక అధికారులు

 

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద అలమండ-కంటకాపల్లి వద్ద ఆగి ఉన్న పలాస ప్యాసింజర్ రైలును రాయగడ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్యాసింజర్ నాలుడు బోగిలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. అధికారులు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ప్రమాద స్థలంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఆ ప్రాంతం అంతా చీకటిగా మారింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు నిలిచిపోగా.. పలాస ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.

Vizianagaram Train Accident,విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం.. ఒడిశా తరహా దుర్ఘటన - vizianagaram train accident, 8 killed as two trains collied in andhra pradesh - TimesXP Telugu

జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే, విశాఖ జిల్లా అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. విశాఖపట్టణంలోని కేజీహెచ్, విమ్స్‌లో వైద్య బృందాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. విశాఖపట్టణం నుంచి ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు పంపించారు. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

 

హెల్ప్‌లైన్ నంబర్లు ఇలా..
విజయనగరం కలెక్టరేట్: 94935 89157
విశాఖ కలెక్టరేట్: 90302 26621, 70361 11169, 08912 590102
కేజీహెచ్ 89125 58494, 83414 83151

83414 83151 (ఈ నంబరులో నిత్యం వైద్యుడు అందుబాటులో ఉంటాడు)
అత్యవసర వైద్య సదుపాయం కోసం 8688321986 నంబరును సంప్రదించవచ్చు
భువనేశ్వర్: 06742301625, 06742301525, 06742303060, 06742303729
వాల్తేరు టెస్ట్ రూం 89780 80805
సీనియర్ సెక్షన్ ఇంజినీర్ 89780 80815
వాల్తేరు డివిజన్ 08942286245, 08942286213
అలమండ, కంటకాపల్లి : 89780 81960
విజయనగరం: 08922221206, 08922221202, 8978080006
శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245
ఏలూరు: 08812232267
సామర్లకోట: 08842327010
రాజమహేంద్రవరం: 08832420541
తుని: 08854252172
విశాఖపట్టణం రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు: 08912 746330, 08912 744619, 8106053051, 81060 53052, 85000 41670, 85000 41671

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :