అన్నమయ్య జిల్లా, హుకుంపేట : ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… గిరిజన ప్రాంతాలలో మాతా శిశు మరణాలు ఆగడం లేదు. పౌష్టికాహార లోపం, రక్తహీనత, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి ప్రధాన కారణాలతో గర్భిణులు, బాలింతలు మృత్యువాతపడుతుండగా పుట్టిన వెంటనే నాణ్యమైన సంరక్షణ లేకపోవడం, చికిత్స లేకపోవడం.. అంటువ్యాధుల కారణంగా నవజాత శిశువులు చనిపోతున్నారు. శిశు మరణాలు గిరిజన కుటుంబాలలో ఆందోళన కలిగిస్తుంది.
హుకుంపేట మండలం గడుగుపల్లి గ్రామంలో రెండున్నర సంవత్సరాల పాప శుక్రవారం మరణించింది. తాడిపుట్టు పంచాయితీ గడుగుపల్లి గ్రామంలో మహేష్ నాయుడు, శాంతి కుమారి దంపతులకు పుట్టిన పాపా రెండున్నర నెలలకె చనిపోయింది.
జిల్లా అధికారులు శిశు మరణాలు తగ్గించాలని, క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా కింది స్థాయి సిబ్బందిని ఆదేశించాలని గిరిజనులు కోరుతున్నారు.