అల్లూరి సీతారామరాజు జిల్లా ల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు , గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనంతగిరి మండలం పినకోట గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెద గెడ్డ ఉప్పొంగి ప్రవహిస్తుంది. గెడ్డ వాగు అవతలికి వెళ్లి పంటపొలాలు చేసుకోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళవలసి వస్తుంది. సుమారు వంద గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. పొలాలలకు వెళ్ళాలన్న, విద్యార్థులు .. పాఠశాలకు వెళ్ళాలన్న, అనారోగ్య భారిన పడినా ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితి. ఇకనైనా స్థానిక నాయకులు స్పందించి పెద గెడ్డ వాగు పై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
