- టీడీపీ గుంటూరు జిల్లా యస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ
గిరిజన మహిళలు ఆర్ధికంగా ఎదగాలన్న,భరోసా కల్పించాలన్న చంద్రబాబు ప్రవేశపెట్టిన “మహాశక్తి “పధకం అండగా ఉంటుందని మేడా రామకృష్ణ తెలిపారు.
ఆనాడు ఎన్టీఆర్ మహిళలకు అన్న గా ఉండి సమాన ఆస్థి హక్కు చట్టం తెచ్చారని గుర్తుచేశారు. మళ్ళీ గిరిజనుల కోసం అదే బాటలో చంద్రబాబు గిరిజన మహిళలు ఆర్ధికంగా ఎదగడానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు.
వైసీపీ నాలుగేళ్ళ పాలనలో గిరిజన మహిళలపై దాడులు, హత్యచారాలు,దూరగతాలు, ఎక్కువైనాయిన్నారు.అన్యాయలపై ప్రశ్నించిన గిరిజన మహిళలపై తప్పుడు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.
2024 లో టీడీపీ అధికారంలో వచ్చిన వెంటనే మహాశక్తి పధకం ద్వారా గిరిజన మహిళ కుటుంబానికి ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తు, అర్టీసీ బస్ ప్రయాణం ఫ్రీ చేస్తూ, ప్రతి నెల పాకెట్ మనీ రూ 1500 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని మేడా రామకృష్ణ పేర్కొన్నారు.
రాష్ట్రములోని గిరిజన మహిళలు అందరు ఈ సైకో పాలనతో విసుగెత్తి పోయారన్నారు.ఈ సైకో పాలనను 2024 లో తరిమికొట్టడానికి గిరిజన మహిళలు సిద్ధంగా ఉన్నారని మేడా రామకృష్ణ తెలిపారు.సైకో పోవాలి… సైకిల్ రావాలని తెలుగుదేశం పార్టీ ని గెలిపించాలని కోరారు .