contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగునో..?

  • నిద్ర మత్తులో అధికారులు
  • కనీసం పట్టించుకోని నాయకులు
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలు
  • సారూ .. ఈ రోడ్డు గురించి పట్టించుకోరూ..!

 

అల్లూరి జిల్లా, అనంతగిరి:  మండలం పరిధిలో గల పినకోట,పెదకోట,కివర్ల పంచాయతీలకు చెందిన చటాకంభ నుండి పూతికి పుట్టు, బోనూరు, చీడిమెట్టు, నడింవలస,తాండవలస,గడ్డి బంద,పందిరిమామిడి,జగడల మామిడి గ్రామాల్లో సుమారు 300 మంది ఎస్టీ కొండ దొర ఆదివాసి గిరిజనులు కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తున్నారు.

చటాకంబ నుండి జగడల మామిడి,బోనూరు,చీడిమెట్టు, గడ్డి బంద,మెట్టువలస తదితర 9 గ్రామాలకు ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.19 కోట్ల ఆరు లక్షల 45వేలను 22 కిలోమీటర్లకు నిధులు విడుదల చేశారు, RC. NO.467/BT. CC&WBM/Roads 2019-20. Dt:27-2-2020 ప్రొసీడ్ ఆర్డర్ ను ఉమ్మడి జిల్లా కలెక్టర్ నిధులు విడుదల చేశారు.  2021లో పనులు మొదలుపెట్టారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మధ్యలో పనులు నిలుపుదల చేశారు.

17 కిలోమీటర్లు మూడు నెలలు,  200 మంది శ్రమదానంతో కచ్చా రోడ్డు నిర్మాణం చేసుకు న్నామన్నారు, దీనిపై సోషల్ మీడియా, పలు దిన పత్రికల్లో, అలాగే జాతీయ మీడియాలో,బీబీసీ వంటి ఛానల్లో కథనాలు ప్రచురించడంతో అప్పటి ఐటీడీఏ పీవో బాలాజీ చదవతో ఆగమేఘాల మీద రూ.19 కోట్ల ఆరు లక్షల45వేల రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఐటీడీఏ పీవో కూడా ఈ రోడ్డుని స్వయంగా ఉపాధి పనులను పరిశీలించారు – రోడ్డు పూర్తయిందని అందరం ఆనందించాము, కానీ నేటికీ పనులు సగం సగం చేసి వదిలేయడంతో ఈ
మధ్య కాలంలో పూతిక పుట్టు గ్రామానికి చెందిన పుట్టబోయిన రామన్న బైక్ మీద వెళుతుండగా రోడ్డు తోవ్వేసిన గోతుల్లో పడిపోయి కాలు దెబ్బలుతగిలాయి.దింతో డోలుతో మోసుకెళ్లి హాస్పిటల్ లో చేర్చడం జరిగింది, రోడ్డు మధ్యలో రాళ్ల గుట్టలు వేయడంతో కనీసం బైకులు నడవలేని పరిస్థితి తయారయిందని,గర్భిణీ స్త్రీలను పినకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు వెళ్లాలంటే 20 కిలోమీటర్లు డోలు మోసుకుని వెళ్లే పరిస్థితి. ఇంటింటా రేషన్ పథకం, అంగన్వాడి సెంటర్ కు బియ్యం కోసం 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వస్తుందని వాపోయారు.

మేము సొంతంగా వేసుకుని రోడ్డును కూడా తవ్వేసి మధ్యలో వదిలేయడంతో మా బాధలు ఎవరో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని,ఓటు వేయాలంటే 20 కిలోమీటర్ల దూరం వెళ్లవలసిన పరిస్థితి, రోడ్డు పనులు ప్రారంభించి నేటికి నాలుగు సంవత్సరాలు అవుతున్న నేటికీ పూర్తి చేయకపోవడంతో మేమందరం అంబులెన్స్ వస్తాయని ఆశించి మీ సొంతంగా రోడ్డు నిర్మాణం చేసుకుంటే ఉన్న రోడ్డుని పాడుచేసిగొయ్యి,గొయ్యిలు తవ్వేసి మధ్యలో వదిలేయడం ఎంతవరకు న్యాయమని,తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించకపోతే మార్చి ఎనిమిదో తేదీన పాడేరు ఐటిడిఏ, కలెక్టర్ కార్యాలయం వద్ద డోలి యాత్ర నిర్వహించాలని ఈ డోలి యాత్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి మాదల సోమన్న, మాదల వెంకట్రావు రోడ్డు సాధన కమిటీ (కన్వీనర్) పొట్టన్న పుట్టబోయిన, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :