బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది. జోయా పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. యానిమల్ సక్సెస్ త్రిప్తి కెరీర్‌కు బిగ్గెస్ట్ బ్రేక్ గా నిలిచిందనే చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నఈ బ్యూటీ.. ఇటీవలే ‘బ్యాడ్ న్యూస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. జులై 19న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక అటు బాలీవుడ్, టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ.. ఇప్పుడు హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతుంది.