మునుగోడు ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుక్రవారం పార్టీ అధినేత కేసీఆర్ నుంచి డబుల్ బొనాంజా అందింది. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా తన పేరును పార్టీ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ప్రగతి భవన్‌కు వెళ్లిన ప్రభాకర్ రెడ్డి… సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవసరమైన బీఫామ్‌ను ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ అందజేశారు.
అనంతరం ఉప ఎన్నికల్లో ఖర్చుల కోసమంటూ ప్రభాకర్ రెడ్డికి రూ.40 లక్షల చెక్కును కేసీఆర్ అందించారు. పార్టీ నిధి నుంచే ఈ మొత్తాన్ని ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ అందించినట్లు టీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపింది. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అవకాశమివ్వడంతో పాటుగా ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షలను ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రభాకర్ రెడ్డి కృతజ్జతలు తెలిపారు.
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న @Koosukuntla_TRS గారికి సీఎం కేసీఆర్ గారు పార్టీ బీఫామ్ ను అందజేసారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును అందించారు. అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ప్రభాకర్ రెడ్డి కృతజ్జతలు తెలిపారు. pic.twitter.com/EIgDx5ts9X
— TRS Party (@trspartyonline) October 7, 2022