యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సంబంధించి టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ మాటల యుద్ధం తాజాగా మరింత ముదిరింది. ధాన్యం కొనుగోళ్లకు ముందుకు రాకుండా కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ నాటకాలు ఆడుతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. యాసంగి వడ్ల కేంద్రం కొనుగోలుకు సిద్ధంగా లేదని కేసీఆర్ ముందే రైతులకు సూచించారని కేటీఆర్ తెలిపారు. రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన కేంద్రంలోని బీజేపీ.. ఇప్పుడు యసంగి ధాన్యం కొనమంటే నాటకాలు చేస్తోందని ధ్వజమెత్తారు. యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రంతో కొనిపించే దిశగా సాగుతున్న ఈ పోరాటం అన్నదాత పోరాటం మాత్రమే కాదన్న ఆయన.. ఇది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటమని తెలిపారు.
యాసంగి వడ్లు కేంద్రం కొనుగోలుకు సిద్ధంగా లేదని ముందే రైతులకు సూచించిన కెసిఆర్ !!
రైతులను రెచ్చగొట్టి వరి వేయించి, ఇపుడు యసంగీ ధాన్యం కొనమంటే కేంద్రం నాటకాలు చేస్తోంది!
ఇది *అన్నదాత పోరాటం మాత్రమే కాదు* ఇది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం* pic.twitter.com/zrmOpSWQZ4
— KTR (@KTRTRS) April 9, 2022