ప్రభుత్వం తమ ఉపాధ్యాయులకు సంబంధించి శనివారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా స్థిర, చరాస్తులకు సంబంధించి క్రయ విక్రయాల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.