కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఉద్యమకారులఫోరం సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ కనకం కుమారస్వామి హాజరు కావడం జరిగింది, ఈ సమావేశంలో గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామానికి చెందిన పీచు చంద్రారెడ్డి ని గన్నేరువరం మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, ఈ నియామకానికి సహకరించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ సీమ శ్రీనివాస్ కి ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి కి పీచు చంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమలో ఉద్యమకారులు మహేందర్ తదితరులు ఉద్యమకారులు పాల్గొన్నారు.