contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు నందెల్లి మహిపాల్ అరెస్ట్

  • మాజీమంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరుడు నందెల్లి మహిపాల్ ని పోలీసులు అరెస్ట్ – రిమాండ్ కు తరలింపు
  • నకిలీ ధృవపత్రాలు సృష్టించి అక్రమంగా భూఆక్రమణకు పాల్పడ్డందుకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నందు 9 మందిపై కేసు నమోదు

 

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ లోని కొత్తపల్లికి చెందిన 15 గుంటల స్థలానికి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అక్రమంగా భూ ఆక్రమణకు పాల్పడ్డందుకు
1) చిట్యాల కిష్టమ్మ, 2) గుండ రాజమల్లు, 3) నందలి మహిపాల్, 4) గంగాధర కనకయ్య, 5) నక్క జితేందర్, 6) నక్క పద్మ, 7) తాటిపాముల రాజు, 8) కొత్తకొండ శ్రీను(మైకల్ శ్రీను), 9) చిల్ల శ్రీనివాస్ (మాజీ కొత్తపల్లి ఎమ్మార్వో) లపై
మంగళవారం నాడు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నందు ఎర్రం కనకారెడ్డి తండ్రి భూంరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందిపై Cr. No. 68/2024, పలు ఐపీసీ సెక్షన్ల కింద U/Sec. 467,468,471,420, 386, 506, 120B r/w 34 కేసు నమోదు చేశారు.

ఎర్రం కనకారెడ్డి, తండ్రి భూంరెడ్డి అనే వ్యక్తి 2008 వ సంవత్సరంలో సర్వేనెంబర్ 776,777,778 లో 15 గుంటల స్థలాన్ని చిట్యాల కిష్టమ్మ అనే వ్యక్తి వద్ద నుండి రిజిస్టర్ డీడ్ నెంబర్ 2288/2008. ద్వారా కొనుగోలు చేసి ఉన్నాడన్నారు. ఇదిలా ఉండగా దురుద్దేశపూర్వకంగా(A1) చిట్యాల కిష్టమ్మ , (A4) గంగాధర కనకయ్య తో కలిసి మోసపూర్వకంగా ఎర్రం కనకారెడ్డి అనే వ్యక్తి భూమిని కాజేయాలనే దురుద్దేశంతో నకిలీ సేల్ అగ్రిమెంట్ డీడ్ ను (A2) గుండ రాజమల్లు పేరిట సృష్టించారు. ఈ నకిలీ సేల్ అగ్రిమెంట్ డీడ్ ధ్రువపత్రము ఆధారంగా ముందుగా ఎర్రం కనకారెడ్డి పేరిట ఉన్నటువంటి ఒరిజినల్ అగ్రిమెంట్ సేల్ డీడ్ ధ్రువపత్రాన్ని వారికున్న అధికార బలంతో (క్యాన్సిల్) రద్దు చేయించారన్నారు. తర్వాత అట్టి భూమిని (A2) గుండ రాజమల్లు పేరిట రిజిస్టర్ డిడ్ బియరింగ్ నెంబర్ (4637/2016) ద్వారా రిజిస్ట్రేషన్ కాబడిందన్నారు. అట్టి భూమిని తదుపరి (A2) గుండ రాజమల్లు, అనే వ్యక్తి (A5) నక్క జితేందర్ మరియు (A6) నక్క పద్మ లకు అమ్మగా, తరువాత వారినుండి అదే భూమిలో కొంత భాగం (A6)నక్క పద్మ అనే వ్యక్తి తిరిగి (A7)తాటిపాముల రాజు మరియు (A8)కొత్తకొండ శ్రీను @ మైఖేల్ శ్రీను అమ్మే ప్రయత్నం చేసిందన్నారు. ఇదిలా కొనసాగుతుండగా బాధితుడు న్యాయంకోసం గౌరవ కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసినందున, నందెల్లి మహిపాల్ అనే వ్యక్తి బాధితుడిని పిలిపించి, పిటిషన్ వాపసు తీసుకోవాల్సిందిగా లేనిచో చంపేస్తానని బెదిరింపులకు గురిచేయడమేగాక ఈ పూర్తి సమస్య పరిష్కరించుటకు నాలుగు గుంటల ల్యాండ్ ను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని కూడా డిమాండ్ చేశాడన్నారు. తరువాత ఈ నిందితులంతా కలిసి కుమ్మక్కై (A9) చిల్ల శ్రీనివాస్ ను కలిసి (మాజీ కొత్తపల్లి ఎమ్మార్వో) అతని సహకారంతో, ఈ భూవివాదం పరిష్కారకోసం గౌరవ కోర్టులో పెండింగులో ఉన్నప్పటికీ, నిందితుల పేరిట మ్యుటేషన్ కూడా చేశాడన్నారు. ఇట్టి కేసులో నిందితుడుగా ఉన్నటువంటి నందెల్లి మహిపాల్ ను గౌరవ కోర్టులో హాజరుపరచగా కేసు పూర్వపరాలు పరిశీలించిన గౌరవ మెజిస్ట్రేట్ నిందితుడిగా గుర్తించి 14 రోజుల రిమాండ్ విధించారు. కరీంనగర్ రూరల్ పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు.

తెలంగాణ కార్మికుల అణచివేత .. పట్టించుకోని అధికారులు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :