- వనం వీడి జనంలోకి వచ్చేలా కుటుంబ సభ్యులు చూడాలి.
- లొంగిపోతే ప్రభుత్వం నుండి వచ్చే అన్ని ప్రయోజనాలు అందేలా చూస్తాం : జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : పోరు కన్నా ఊరు మిన్న కార్యక్రమం లో భాగంగా పెంచికల్పేట్ మండలం అగర్ గూడా గ్రామానికి చెందిన మావోయిస్టు సభ్యురాలు చౌదరి అంకు బాయ్ అలియాస్ అనిత యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా అంకు బాయ్ కుటుంబ సభ్యుల ప్రస్తుతస్థితిగతులతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు నిత్యావసర సరకులు, దుస్తులు పోలీసు అధికారులు అందజేశారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వనం వీడి జనంలోకి వచ్చేలా చూడాలని ,లొంగిపోతే ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేస్తామని కుటుంబ సభ్యులను కోరడమైనది. ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి , మావోయిస్టు పార్టీలో పని చేసి సాధించింది శూన్యమని. ఇకనైనా అంకు బాయ్ అజ్ఞాతం వీడి జనంలోకి రావాలని, ప్రస్తుత రోజుల్లో మావోయిస్టులకు ప్రజాదరణ తగ్గిందని ఇవే కాకుండా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారని ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యారని, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే వారిపై ఉన్న రివార్డ్ పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు అందేలా కృషిచేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
గ్రామస్తులతో మాట్లాడుతూ… ప్రజలు , యువత చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని . గ్రామస్తుల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీళ్లంతా త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం గ్రామస్తులకు చీరలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం లో కాగజ్నగర్ డిఎస్పి రామనుజం, కాగజ్నగర్ రూరల్ సీఐ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, పెంచికల్ పెట్ ఎస్సై కొమురయ్య, ఆర్.ఎస్.ఐ ఓదేలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.