శాసన సభ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మారుస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను అణచివేసిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అందరూ టీజీ అని రాసుకున్నామని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాసి టీఎస్ అని పెట్టారన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాక శాసనసభ తీర్మానం మేరకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్‌ను టీజీగా మారుస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా లేఖను పంపించామన్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వెహికిల్స్ అన్నీ టీజీ మీదనే అవుతాయన్నారు.