Hyderabad: ఆంధ్రా పెత్తందారుల చేతిలో నేటికీ తెలంగాణ సినీ మరియు టీవీ కార్మికులు నలిగిపోతున్నారు. అడుగడుగునా అణచివేయబడుతున్నారు. నేటి కి విభజన చట్టం అమలు కాలేదు. తెలంగాణ సినీ, టీవీ కార్మిక సంఘాలు చెల్లవు, ఫెడరేషన్ ఫేక్ , ఛాంబర్ లేదు. తెలంగాణ కార్మిక సంఘాలలో ఉంటె కడుపు పై కొడతారు. తెలంగాణాలో ఉన్న ఆంధ్రా సినీ కార్మిక సంఘాలు తెలంగాణ సినీ కార్మిక సంఘాలు చెల్లవంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఆంధ్రా సినీ కార్మిక సంఘాల ఆగడాలకు అంతులేదు. కలెక్షన్లు, మోసాలు, దందాలు పట్టించుకునే అధికారి గాని, నాయకులు గాని లేరు. గత ప్రభుత్వం తెలంగాణ సినీ కార్మికుల సమస్యల పై పట్టనట్టు వ్యవహరించింది. కనీసం సియం రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డల సమస్యల పై స్పందిస్తారని ఆశించారు. కానీ ఆంధ్రా సినీ పెత్తందారులకు ఆహ్వానాలు, అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ తెలంగాణ సినీ కార్మికుల సమస్యల పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటప్పుడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఎందుకు ? ఆంధ్రా సినిమాటోగ్రఫీ మంత్రి అని పెట్టుకుంటే సరిపోలే ? తెలంగాణ మంత్రుల తీరునుబట్టే ఆంధ్రా పెత్తందారులు తెలంగాణ సినీ మరియు టివి కార్మికులను అణచివేస్తున్నారని తెలంగాణ కళాకారులు మండిపడ్డారు.
తెలంగాణ భాషను వెక్కిరిస్తారు, యాసను వెక్కిరిస్తారు. తెలంగాణ స్లాంగ్ ఉన్న క్యారెక్టర్ కి ఆంద్రోళ్ళ చేత డబ్బింగ్ చెప్పిస్తారు. అంటే అణచివేత ఎక్కడుంది ? మనకి కనబడేది ఒకటి చేస్తున్నది మరొకటి ఎవరు గమనించాలి ? ఎవరు తెలంగాణ బిడ్డల ఆర్తనాధాలు వినేది ! పని చేయించుకుని కార్మికుల వేతనాలు ఇవ్వరు. శ్రమ దోపిడీ చేస్తున్నారు. అడిగితె రౌడీ షీటర్స్ తో బెదిరింపులు లేదా అక్రమ కేసులు పెట్టి పోలీసుల చేత మానసిక వేదనకు గురిచేస్తున్నారు. అంటే డబ్బుతో పోలీసులను, రౌడీ షీటర్స్ ను కొంటున్నారా ? లేక ఏంటి ? సుమారుగా 40 ఏళ్ళు ఆంధ్రా సినీ పెత్తందారుల చేతిలో తెలంగాణ బిడ్డలు అడుగడుగునా అణచివేయబడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందిస్తారా ? వేచి చూడాల్సిందే.