కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బొమ్మకంటి అక్షయ TS WRJC CET – 2021 జరిగిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించి సిద్దిపేట మండలంలోని మిట్టపల్లి నందు గల TSWR జూనియర్ కళాశాలలో సీటు సాధించడం జరిగింది 60 మార్కులకు గాను 47 మార్కులు సాధించి కాలేజీలో సీటు సాధించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గల 120 సీట్లు గాను గన్నేరువరం మండలం నుండి బొమ్మకంటి అక్షయ సీటు సాధించడం ఇందులో బిసిలకు 12% రిజర్వేషన్ కలిగిన అయినా గన్నేరువరం మండలం నుండి సీటు రావడం గమనార్హం, ప్రధానోపాధ్యాయులు కట్టా రవీందర్ చారి,ప్రవీణ్, శరత్ కుమార్,శిలా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు బొమ్మకంటి అక్షయ కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానోపాధ్యాయులు కట్టా రవీంద్ర చారి మాట్లాడుతూ గన్నేరువరం మండల నుంచి ప్రధాన పాఠశాల నుంచి మరికొంత మంది విద్యార్థులు, ఉత్తీర్ణత సాధించాలని అదేవిధంగా బొమ్మకంటి అక్షయ మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.