జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ సమక్షంలో మెట్ పల్లిలోని తన నివాసంలో నూతనంగా ఎన్నిక కాబడిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్(టీ ఎస్ జె యు ) కోరుట్ల నియోజకవర్గ కమిటీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ…నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా అనుబంద రాష్ట్ర కమిటి అయినటువంటి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్(టి ఎస్ జె యు ) కోరుట్ల నియోజకవర్గ కమిటికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో జర్నలిస్టులది ముఖ్యపాత్రని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవదళ్ అధ్యక్షుడు అందే మారుతి బాపూజీ,పట్టణ మైనార్టీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా,టి ఎస్ జె యు కోరుట్ల నియోజకవర్గ కమిటీ గౌరవ అధ్యక్షుడు దీకొండ మురళి,అధ్యక్షులు జోరిగే శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి తరి రాజ శేఖర్,ఉపాధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, మీడియా ఇంచార్జ్ నన్నపురాజ్ రవిరాజ్,ఈసీ మెంబెర్స్ గట్ల శ్రీనివాస్, దూది గణేష్, సయ్యద్ ఫిరోజ్,సభ్యులు గుండవేని రమేష్,గట్ల సునీల్, చొక్కాల రవీందర్, బెజ్జరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.