భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై భవానీ సేన్ అత్యాచారం చేశారు. సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి 2 సార్లు రేప్ చేశాడు. 20 రోజుల కిందట, మళ్లీ 2 రోజుల కిందట 2సార్లు రేప్ చేసినట్లు బాధిత కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరికైనా చెబితే అదే చివరి రోజంటూ ఎస్సై వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పింది. తాను మంత్రి మనిషిని, ఎవరూ ఏం చేయలేరంటూ తోటి సిబ్బందిని సైతం ఎస్సై భవానీ సేన్ బెదిరించినట్లు తెలిపింది.
ఎస్సై భవానీ సేన్ ఆగడాలు మితిమీరడంతో ఉన్నతాధికారుల్ని బాధిత మహిళా కానిస్టేబుల్ ఆశ్రయించింది. ఏఎస్పీ, డీఎస్పీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విచారణ చెప్పట్టారు. ఎస్సైను అరెస్ట్ చేసి, సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్సైపై అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఎస్సై, మహిళా కానిస్టేబుల్ భూపాలపల్లి ఎస్పీ ఆఫీసుకు తరలించారు.