contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎస్ఐ ను సర్వీస్ నుంచి తొలగించండి : సీఎం రేవంత్

మహిళా కానిస్టేబుల్ పై అఘాయిత్యానికి పాల్పడిన కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవానీసేన్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్‌ఐ భవాని సేన్ గౌడ్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసింది. శాంతి భద్రతలు కాపాడుతూ.. మహిళలకు అండగా ఉండాల్సిన ఎస్ఐ ఇలా ఓ మహిళా కానిస్టేబుల్ ను రేప్ చేయడంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిచింది. ఎస్ఐ భవాని సేన్ గౌడ్ ను సర్వీస్ నుంచి తొలగించింది.

అసలేం జరిగింది..

భూపాలపల్లి జిల్లా (Bhupalapally District) కాళేశ్వరం (Kaleshwaram) లో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్‌ పై ఎస్సై భవానీ సేన్ అత్యాచారం చేశారు. సర్వీస్‌ రివాల్వర్‌తో బెదిరించి 2 సార్లు రేప్ చేశాడు. 20 రోజుల కిందట, మళ్లీ 2 రోజుల కిందట 2సార్లు రేప్ చేసినట్లు బాధిత కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరికైనా చెబితే అదే చివరి రోజంటూ ఎస్సై వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పింది. తాను మంత్రి మనిషిని, ఎవరూ ఏం చేయలేరంటూ తోటి సిబ్బందిని సైతం ఎస్సై భవానీ సేన్ బెదిరించినట్లు తెలిపింది.

ఎస్సై భవానీ సేన్ ఆగడాలు మితిమీరడంతో ఉన్నతాధికారుల్ని బాధిత మహిళా కానిస్టేబుల్ ఆశ్రయించింది. ఏఎస్పీ, డీఎస్పీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి విచారణ చెప్పట్టారు. ఎస్సైను అరెస్ట్‌ చేసి, సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్సైపై అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఎస్సై, మహిళా కానిస్టేబుల్ భూపాలపల్లి ఎస్పీ ఆఫీసుకు తరలించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :