contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

TSPSC: 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మార్చి 14న సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. మే/జూన్ నెలల్లో ప్రిలిమినరీ పరీక్షలు, సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో మెయిన్స్ నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు, వయో పరిమితి, వేతనం తదితర పూర్తి వివరాలతో ఈ రోజు సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు తర్వాత ఎడిట్ చేసుకునేందుకు 23 మార్చి ఉదయం 10 గంటల నుంచి 27 మార్చి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. హాల్ టిక్కెట్‌ను ఏడు రోజుల ముందు నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :