ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మార్చి 20, 21వ తేదీలలో తిరుమల పర్యటన నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్, ఇంజినీరింగ్, గార్డెన్, అన్న ప్రసాదం అధికారులతో ముఖ్యమంత్రి పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
అనంతరం అన్న ప్రసాదం నాణ్యత, రుచిపై భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు అన్న ప్రసాదం చాలా రుచికరంగా ఉందని అదనపు ఈవో వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, డిప్యూటీ ఈఈ వేణు గోపాల్, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.