తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుక, 30న ఉగాది వేడుక జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందున 24, 29 తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం జరగదని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల 23న స్వీకరించి 24న దర్శనానికి అనుమతించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.