తిరుపతి జిల్లా : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధర్మాక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ,టిటిడిలో ఇంజనీరింగ్ విభాగంలో ఫైల్స్ దగ్ధం చేయటం అనేది వైసీపీ కోవర్ట్స్ కుట్ర అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ అన్నారు. టిటిడిలో కొందరు వైసిపి కోవర్ట్ లు అంతర్గతంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తిష్ట వేసి అరాచకాలకు పాల్పడి, ఇంజనీరింగ్ శాఖలో జరిగినటువంటి అవినీతిని, అక్రమాలని కప్పిపుచ్చాలని ఈ ఫైల్స్ దగ్ధం జరిగిందన్నారు. ఇది ప్రమాదంగా చిత్రీకరించి దీంట్లో నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదన్నారు. ఒకపక్క హండి నీ దోచుకుని, మరోపక్క ఇంజనీరింగ్ విభాగంలో డబ్బులు దండుకుని, ఒకపక్క ప్రసాదాల తయారీలో , అన్నప్రసాదంలో నాసిరకం వస్తువులు సరఫరా చేసి, కమీషన్లు దండుకున్నారన్నారు. వీటన్నిటిని మాయం చేయడానికి శనివారం ఫైల్స్ ని మాయం చేయడానికి కుట్ర పన్నారన్నారు. రాష్ట్రంలో వైసిపి హయాంలో జరిగినటువంటి అక్రమాలు అన్నిటిని కూడా మాయం చేయడానికి ఫైల్ దగ్ధం చేసే కార్యక్రమాన్ని వైసీపీ కోవర్ట్ లు చేపట్టారన్నారు. మదనపల్లిలో, అమరావతిలో ,పోలవరంలో, ఎమ్మార్వో కార్యాలయంలో మైన్స్ శాఖలో, అదే విధంగా బ్రేవరేజెస్ శాఖలో ,ఫైల్స్ దగ్ధం చేసి నిజాల్ని మట్టుపెట్టాలని ప్రయత్నం జరిగిందన్నారు. ఇవన్నీ కూడా వైసిపి కోవర్ట్ లు చేసినటువంటి కుట్రని వీటన్నిటికీ భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందన్నారు. ముఖ్యంగా టీటీడీలో జరిగిన ఫైల్స్ దగ్ధం పైన సిబిసిఐడి చేత విచారణ జరిపించాలన్నారు ఈ మీడియా సమావేశంలో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, టిడిపి బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, టిడిపి నాయకులు విజయ్ కుమార్, గోపాల్, యువరాజు నాయుడు, సురేష్ ,జిల్లా తెలుగు రైతు కార్యదర్శి జైపాల్ తదితరులు పాల్గొన్నారు.