తిరుమల తిరుపతి దేవస్థానం లో లాంగ్ టైం డిప్యూటేషన్ ఆర్డర్ ని రద్దు చేయాలని టిటిడి ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు. టిటిడి జేఈవో గా పోలా భాస్కర్ ఉన్న టైం నుంచి లాంగ్ టైం డిప్యూటేషన్ ఆర్డర్ జరుగుతున్నాయనీ ఈ డిప్యూటేషన్ వలన కింది స్థాయి ఉద్యోగులకు అదనపు భారం పడి, పని భారం ఎక్కువ అవుతున్నాయన్నారు. ఇప్పటికీ కొన్ని శాఖల్లో లాంగ్ టైం డిప్యూటేషన్ జరుగుతున్నాయనీ వీటిని రద్దు చేయాలని టీటీడీ ఉద్యోగులు కోరుతున్నారు.
కొన్ని శాఖలలో (ఎస్ఓపి) స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అమలు కావడం లేదని, దీనివల్ల టెక్నికల్ పోస్టులవారు నాన్ టెక్నికల్ చేస్తున్నారని, మినిస్ట్రియల్ స్టాప్ చేయవలసింది అసిస్టెంట్ క్యాడర్ వారు చేస్తున్నారన్నారు. దీనివలన ఆ సంస్థ అభ్యున్నతికి ప్రశ్నార్థకంగా మారుతుందని. అంతే కాకుండా మిగతా ఉద్యోగస్తులు మీద పని భారం పడుతుందన్నారు. కొన్ని శాఖల పరిస్థితి కంచే చేను మేసే విధంగా ఉందన్నారు.
గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల ప్రోత్బలంతో మెడికల్ అసిస్టెన్సీ ఎవరికి ఇవ్వాళో ఇవ్వకుండా అస్తవ్యస్తంగా ఇష్టం వచ్చిన వాళ్లకు ఇష్టారాజ్యంగా సరైన సర్టిఫికెట్స్ లేని వాళ్లకు కూడా ఇచ్చి ఈ మెడికల్ అసిస్టెన్సీ నీ బ్రష్టు పట్టించారన్నారు. దీనివల్ల కూడా పనిభారం పెరిగిందనీ దీనికి ముఖ్యంగా గత టిటిడి జెఈఓ ఉన్న టైం లో మెడికల్ అసిస్టెన్సీ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు. దీనిపైన టీటీడీ ఈవో శ్యామల రావు సరియైన విచారణ చేయాలని టిటిడి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.