- కార్మికుల పక్షాన పోరాడుతా
- దిడ్డి ప్రవీణ్ కుమార్
భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన కార్మిక సంఘం ట్రేడ్ యూనియన్ కో ఆర్డినేషన్ సెంటర్ (టీయూసిసి) యంగ్ ఇండియా జాతీయ కన్వీనర్ గా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. జీ 20 సదస్సులో భాగంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోఏడాలో నిర్వహించిన జాతీయ కార్మిక సదస్సులో ట్రేడ్ యూనియన్ కో ఆర్డినేషన్ సెంటర్ (టీయూసిసి) యంగ్ ఇండియా జాతీయ కోఆర్డినేటర్ గా ప్రవీణ్ ను ఎన్నుకున్నారు. ఈ సదస్సులో దేశ వ్యాప్తంగా మధ్యప్రదేశ్, ఛత్తీద్గడ్, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, సిక్కిం, మేఘాలయ, మణిపూర్, కాశ్మీర్ తదితరు రాష్ట్రాలకు చెందిన కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మూడు రోజుల సమావేశలలో కార్మికుల హక్కులు, కార్మికుల వేతనాలతో పాటు డొమెస్టిక్ వైలెన్సు పాటు అసంఘటిత కార్మిక రంగాల్లో పనిచేసే కార్మికులకు వారి హక్కుల కోసం పోరాటం చేసే నేపథ్యంలో ట్రేడ్ యూనియన్ టియుసిసి జాతీయ నూతన కమిటీని ఏర్పాటు చేసింది.
కార్మికుల పక్షాన పోరాడుతా: దిడ్డి ప్రవీణ్ కుమార్
గత 20 సంవత్సరాలుగా సామాజిక కార్యకర్తగా సమాజంలోని పలు అవినీతి, అక్రమాలపై, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియాలతో పాటు కార్మికుల సమస్యలపై గత రెండు దశాబ్దాలుగా నిరంతరం పోరాటం చేస్తున్న తన సేవలను గుర్తించి టియుసిసి యంగ్ ఇండియా జాతీయ కోఆర్డినేటర్ గా తనను ఎన్నుకున్నట్లు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఇకపై తనపై మరింత భారం పెరిగిందని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తన పోరాటాన్ని కొనసాగిస్తారని ప్రవీణ్ తెలిపారు. అసంఘటిత కార్మికుల సమస్యలు, మహిళా కార్మికుల సమస్యలపై, డొమెస్టిక్ తదితర విభాగాల్లో పనిచేసే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగించి, కార్మికుల పక్షాన పొరడంతో పాటు కార్మిక పక్షపాతిగా పేరు తెచ్చుకునేందుకు కృషి చేయడంతో పాటు కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని ప్రవీణ్ తెలిపారు.