మెదక్ జిల్లా / తూప్రాన్ : సర్వ మానవాళి శ్రేయస్సు కోసం అల్లా ఆశీర్వదించి ఆశీస్సులు అందించి, ప్రేమ, సహనం, శాంతిని సామరస్యాన్ని బోధించిన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ – ఉన్ – నభి పర్వదిన వేడుకలు శుక్రవారం తూప్రాన్ లో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరిస్తూ సుఖ సంతోషాలతో పరస్పర సాహార్థ్యంతో ముస్లింలు అంతా జీవనం గడపాలని భక్తి శ్రద్ధలతో పండుగ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల ‘రబీఉల్-అవ్వల్’ 12వ తేదీన వస్తుంది. మౌలిద్ అనునది సాధారణంగా జన్మదినోత్సవం కొరకు వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా ‘మౌలిద్’ గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే. ఇస్లామీయ ప్రవక్త యగు ముహమ్మద్ యొక్క జన్మతిథిని పునస్కరించుకొని, మౌలీద్ షరీఫ్ ప్రారంభించింది. ముహమ్మద్ ప్రవక్త జన్మించిన ఇంటిని, ఖైజురన్, ఓ ప్రార్థనాలయంగా మార్పు చేసింది. ముహమ్మద్ ప్రవక్త కుమార్తె యగు ఫాతిమా జహ్రా వంశస్థులు మొదట ‘మీలాదె నబీ’ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలలో అహలె బైత్ (ముహమ్మద్ ప్రవక్త వంశస్థులు) కు, ప్రధాన ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఖురాన్ను పఠించేవారు, ఇతర సాంప్రదాయక కార్యక్రమాలు నిర్వహించేవారు. ‘మౌలీద్’ లేదా ‘మీలాద్’ ఉత్సవాలు ఆరంభమైనవి. జాతీయ పర్వంగా ప్రకటింపబడింది. మన భారత దేశంలో మీలాద్, అధికారికంగా గుర్తింపబడింది. అందుకే ఈ ఉత్సవాన్ని తూప్రాన్ లో ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పచ్చని జండాలు పట్టుకొని రౌండ్ గా తిప్పుతూ భక్తి శ్రద్ధలతో పాటలు పెట్టుకొని భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అప్సర్ భాయ్, ఉమర్, హాజార్, సమీర్, ఎండి ఉమర్, సమీర్. ఎండి అజార్, సత్తార్ బాయ్. హస్నో భాయ్, బురాన్ భాయ్. హైమద్, ఎండి సైజ్ భాయ్, ఎండి రిజ్వాన్, ఎండి షాను, ఎండి మోజు బాయ్ తదితరులు పాల్గొన్నారు.
